ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన అక్రమాల కేసులో బుధవారం ఉదయం నుంచి ఈడీ సోదాలు చేస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా డైరెక్టర్ మధుసూదనరావు నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌తో పాటు మూల్యాంకనం జరిగిన మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్ రిసార్టులో కూడా ఈ సోదాలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.