వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఎన్నికల ప్రక్రియ అత్యంత ఏకపక్షంగా సాగిందని, వీటిని ఎన్నికలు అనలేమని, ఇవి కేవలం ‘సెలెక్షన్లు’ మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు.చంద్రబాబు నాయుడి టీమ్‌కు, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు! ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశమే లేకుండా చేసి ఎన్నికల్లో ఘన విజయం ఎలా సాధించాలో మీరు నిరూపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల సంస్కరణలు అత్యవసరం. ఇంతకంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు.

