పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుతున్న వేళ ఇరాన్ సంచలన అడుగు వేసింది. అణు విస్ఫోటనం సంభవిస్తే పౌరులు ప్రాణాలు ఎలా రక్షించుకోవాలనే అంశంపై ఇరాన్ ప్రభుత్వం ఎనిమిది నిమిషాల ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.రేడియోధార్మిక ధూళి (న్యూక్లియర్ ఫాల్అవుట్) నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో క్షుణ్ణంగా వివరించింది.ఇరాన్‌లోని కీలకమైన నతాంజ్ అణు కేంద్రాన్ని కలిగి ఉన్న ఇస్ఫాహన్ అత్యవసర సేవల విభాగం ఈ సూచనలను జారీ చేసింది.