రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ అయిన గ్రేటర్ విశాఖ పీఠాన్ని సైకిల్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ఘన విజయం సాధించారు. దీంతో తొలిసారి జీవీఎంసీ పీఠంపై టీడీపీ జెండా ఎగిరింది. మొత్తం 120 వార్డులు కలిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి కూర్పు తిరుగులేని ఫలితాన్ని ఇచ్చింది. కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచే టీడీపీ, జనసేన, బీజేపీఅభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగించి కార్పొరేషన్‌ను దక్కించుకున్నారు.

