అమెరికా ఫ్లోరిడాలో ఓ జెట్ ప్రమాదానికి గురైంది. 15,000 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తోన్న తొమ్మిదిమందీ దుర్మరణం పాలయ్యారు. టెక్సాస్ లోని ఆస్టిన్ నుంచి బహమాస్ కు బయలుదేరిన బిజినెస్ జెట్ ఇది. ఎన్ 722 బీడీ లియర్ జెట్ 60 అనే సంస్థకు చెందినది. మొత్తం తొమ్మిదిమందితో ఆస్టిన్- బెర్గ్ స్ట్రామ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ ఫ్లైట్ బహమాస్ చేరాల్సి ఉండగా మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది.