రాప్తాడు ఉన్నత పాఠశాల దారుణ అమానుష ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్‌ను వెంటనే
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని కాళ్లలో మూడు బుల్లెట్లు దిగబడటంతో పాటు ముఖానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. విపరీతంగా రక్తం పోవడంతో వైద్యులు నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించి, ఆక్సిజన్ అందిస్తూ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, కాళ్లకు అయిన తీవ్ర గాయాల వల్ల నిందితుడి కాళ్లను తొలగించాల్సి రావచ్చునని వైద్యులు చెబుతున్నారు.