మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా, పల్నాడు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. మురసు తుఫాన్ నేడు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.