ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో హెలికాప్టర్ కూలినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జోషిమఠ్ సమీపంలోని హతి పహాడ్ వెనుక ఉన్న చాయీ గ్రామ పరిసరాల్లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు హెలికాప్టర్‌కు సంబంధించిన శకలాలు గుర్తించలేదు. ప్రమాద సమయంలో అందులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారంతా ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, సహాయక బృందాలు ఘటనా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.