ఫ్లైదుబాయ్ విమానం కూల్చివేత ప్రయత్నాన్ని ఇటీవల వీరోచితంగా అడ్డుకుని ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అరుదైన గౌరవం ఇచ్చింది. ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనతో పాటు ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఫ్లైట్ సిబ్బందినీ సత్కరించింది. యూఏఈ అధ్యక్షుడు తరఫున యూఏఈ ఉప ప్రధాని, దుబాయ్ యువరాజు హమ్డాన్ బిన్ మహమ్మద్ అల్ మక్తూమ్.. ఈ అవార్డును మచ్చర్‌కు ఇచ్చారు.