అర్నబ్ తుపాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రైతులను నిండా ముంచింది. మండపేట నియోజకవర్గంలో పంటలన్నీ తుపాను ధాటికి నేలకొరిగాయి. అర్ధరాత్రి నుంచి వీచిన పెనుగాలుల వల్ల రైతులు నష్టపోయారు. పంటపొలాలన్నీ నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే తీవ్ర కరవుతో ఇబ్బంది పడుతున్న తమకు అర్నబ్ తీవ్రనష్టాన్ని మిగిల్చిందని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.