ఐటీ కారిడార్‌లో అనేక మంది బైకర్లు సైలెన్సర్లతో మోత మోగిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సర్వీస్ రోడ్లపైనా బైక్‌లు హోరెత్తిస్తూ దూసుకుపోతుంటాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లపై అప్పుడప్పుడు స్టంట్ షోలు, విన్యాసాల్లాంటివి కనిపిస్తుంటాయి. రాత్రిపూట ఐటీ కారిడార్‌కు వెళ్లే దారిలో పెద్ద శబ్దంతో వచ్చే హై ఎండ్ బైక్‌లు గండెలాగినంత శబ్దం చేస్తాయి. చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేస్తూ దూసుకెళ్లడాన్ని ఆస్వాదిస్తారు. కానీ వారి చుట్టూ ఉన్నవారికి ఇది ప్రాణాంతకమైనదిగా మారుతుంది.