ఢిల్లీలో మద్యం కొనుగోలు కోసం కొత్త ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించి, వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా ‘Delhi Liquor Booking’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రవేశపెట్టినట్లు కథనం పేర్కొంది. అయితే, ఈ విధానంలో ఇంటికి మద్యం డెలివరీ చేసే సౌకర్యం లేదు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లోగా సంబంధిత మద్యం దుకాణానికి వెళ్లి సిబ్బందికి QR కోడ్ చూపించి బాటిళ్లను తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.