అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు పనుల కోసం బ్లాస్టింగ్ పనులు చేపట్టారు. ఇందు కోసం జిలెటిన్ స్టిక్‌ను అమర్చిన ప్రత్యేక పరికరాన్ని వినియోగించారు. అయితే.. పేలుడు సమయంలో అది మిస్‌ఫైర్ కావడంతో అక్కడున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్, ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. అటు వైపుగా వెళ్తున్న ఓ టీచర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.