భారత మార్కెట్ నియంత్రణ సంస్థ (SEBI) నిబంధనల ప్రకారం, లిస్టెడ్ కంపెనీలలో పబ్లిక్ వాటా కనీసం 25 శాతం ఉండాలి ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తన వద్ద అధిక వాటా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్ మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులలో తమ వాటాలను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం పేర్కొంది. OFS లేదా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ పద్ధతుల ద్వారా ఈ వాటా విక్రయం జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.