ఇరాన్‌పై అమెరికా మళ్లీ మిలిటరీ ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. గతంలో చేపట్టిన చర్యల తరహాలోనే ఇరాన్‌పై “మరో చిన్న ఎపిక్ ఫ్యూరీ (Epic Fury) దాడికి” దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, ఈ సైనిక చర్య ఎప్పుడు, ఏ రూపంలో ఉంటుందనేది ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. ఇరాన్ తమ అణు కార్యక్రమాలు, ప్రాంతీయ వ్యూహాలపై దిగిరాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.