బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడుతూ వాయుగుండంగా, ఆపై తీవ్ర వాయుగుండంగా మారేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 26 నాటికి పూర్తిస్థాయి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను అక్టోబర్ 28న ఏపీలోని కళింగపట్నం మరియు మచిలీపట్నం తీరప్రాంతాల మధ్య తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి కృష్ణా జిల్లా వరకు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అసాధారణ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది.