సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. “రజనీ సార్ స్టార్డమ్, స్వాగ్, ఆరాకు ‘జైలర్ 2’ నిజమైన నిదర్శనం. సినిమా ఆద్యంతం ఉత్కంఠను కొనసాగించే కమర్షియల్ ఎంటర్టైనర్. అనిరుధ్ అదరగొట్టాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత ఈ సినిమా కోసం తమ హృదయాలను పెట్టి పనిచేశారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ అద్భుతమైన హిట్ అందించాడు. చొక్కా నలగకుండా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఒక్క రజనీగారికే సాధ్యం” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.