ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ లో ఆయన రిటైర్డ్ కాబోతున్న నేపథ్యంలో మరో ఆరు నెలలు సీఎస్ గా కొనసాగేలా అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీకి లేఖ రాసింది. ఈ మేరకు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 2027 మే 31 వరకు సీఎస్ గా కొనసాగేందుకు అనుమతించింది. 1991 బ్యాచ్ ఐఏఎస్ సాయి ప్రసాద్ ఉమ్మడి ఏపీలో అనేక కీలక స్థానాల్లో పనిచేస్తూ వచ్చారు.