దేశ రాజధాని దిల్లీలో ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్న ఫొటో ప్రదర్శనలోని కొన్ని చిత్రాలను తొలగించాలని బికనీర్ హౌస్ యాజమాన్యం కోరిందని ఆరోపించారు. గత ఏడాది దిల్లీలో జరిగిన యువజన ఉద్యమాలకు సంబంధించిన ఛాయాచిత్రాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రదర్శనకు సంబంధించిన లేఅవుట్ను వారం రోజుల ముందే యాజమాన్యానికి పంపించినట్లు రైహాన్ తెలిపారు. అయితే, ప్రదర్శనకు 24 గంటల ముందు యాజమాన్యం తనను సంప్రదించి, కొన్ని చిత్రాలు తమ విధానానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పినట్లు వివరించారు.