బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఫుట్బాల్ ఆడి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నటుడి డ్రైవర్తో పాటు మరో వ్యక్తి గాయపడగా, వారిని వెంటనే నానావతి ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ చేతికి గాయమైందని వైద్యులు తెలిపారు. ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనిల్ పండిట్, హర్మన్ సంధు బాధ్యులంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.