ఈ నెల 16న మిథున్ రెడ్డి.. పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేయడానికి బయలుదేరినప్పుడు నామినేషన్ల కేంద్రం వద్ద చోటు చేసుకున్న గొడవలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వివిధ సెక్షన్ల కింద వారిపై ఎఫ్ఐఆర్ పెట్టారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో కూడా మిథున్ రెడ్డి పేరు చేర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీకే చెందిన చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డెప్ప, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నాగభూషణం పేర్లు కూడా ఇందులో ఉన్నాయి.