రాష్ట్రంలో రాజ్యాంగ
వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి’ అని మాజీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతిభద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తన పార్టీ మూకలకు గూండా లైసెన్స్ లు ఇచ్చి, వారికి అండగా పోలీసు
యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు అని ప్రశ్నించారు.