దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఐటీ, లోహ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 413 పాయింట్లు పెరిగి 74,729 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,146 వద్ద ముగిసింది. మార్కెట్లలో కొనుగోళ్ల జోరుతో మదుపర్లలో ఆసక్తి నెలకొంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.95గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,197 డాలర్లుగా ఉంది.