కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ కూటమి ఛైర్పర్సన్ అభ్యర్థి ఎంపిక హాట్టాపిక్ అయ్యింది. మాజీ కౌన్సిలర్ మల్లా గణేష్ భార్య మీనాక్షి పేరును ప్రకటించాలని ఎమ్మెల్యే యనమల దివ్య భావించినట్లు తెలుస్తోంది. తుని మున్సిపల్ ఛైర్పర్సన్ సీటు జనసేన పార్టీకి కేటాయించడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. రాత్రికి రాత్రే మల్లా గణేష్, మీనాక్షి టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు.. వెంటనే టికెట్ తుని మున్సిపల్ ఛైర్పర్సన్ సీటు ప్రకటించారు.