పోలీసు యూనిఫాం ధరించి ప్రైవేట్ కార్యక్రమాల్లో డ్యాన్సులు చేయడం, సోషల్ మీడియా రీల్స్ కోసం విచిత్ర వేషధారణలతో రీల్స్ చేయడంపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. యూనిఫామ్ లో ఉన్నప్పుడు నిబంధనలను అతిక్రమించి ఇలాంటి అనధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పోలీసు యూనిఫామ్ అనేది కేవలం వస్త్రం కాదని, అది బాధ్యతకు, అధికారానికి, అలాగే అత్యున్నత క్రమశిక్షణకు ప్రతీక అని గుర్తుచేశారు.