కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. దేశ రాజధాని దిల్లీలోని కొన్నాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్క్ లో అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు ‘లెహ్రా దో తిరంగా’ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీజేపీకి దిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సెంట్రల్ పార్క్ ను శుక్రవారం, శనివారం రెండు రోజులపాటు మూసివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్నాట్ ప్లేస్ గుర్తించిన నిరసన ప్రాంతం కాదని దిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూ దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.