చెన్నైలోని ఫేమస్ థియేటర్లలో ఒకటైన ‘వెట్రి’ థియేటర్కు కూడా సెలబ్రిటీలు క్యూ కట్టారు. జైలర్ 2 ప్రొడ్యూసర్ కళానిధి మారన్ కూతురు కావ్య మారన్ సినిమా చూసేందుకు ఇక్కడికి వచ్చింది. ఆమె వచ్చిన కొద్ది నిమిషాలకే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారని ఇప్పటికే రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఒకే థియేటర్లో జంటగా కనిపించడంతో ఆ వార్తలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

