దివంగత నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి కాకినాడ మేయర్గా పోటీచేస్తారనే చర్చ జరగ్గా.. బీసీకి రిజర్వ్ కావడంతో క్రాంతికి అవకాశం లేకుండా పోయిందంటున్నారు. తాజాగా ఆమె కాకినాడ జెడ్పీ ఛైర్మన్ రేసులో ఉన్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. క్రాంతి తన ఓటును రాజమండ్రి నుంచి కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం మండలానికి మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జెడ్పీ ఛైర్మన్ పదవికి ఆమె పోటీచేస్తారనే చర్చ మొదలైంది. క్రాంతికి జనసేన పార్టీ నుంచి అవకాశం దక్కుతుందనే చర్చ జరుగుతోంది.