టర్కీలోని ప్రముఖ నగరమైన ఇస్తాంబుల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది గంటల వ్యవధిలోనే 100 నుండి 190 మిల్లీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదు కావడంతో నగరం మొత్తం జలమయమైంది. పలు ప్రాంతాల్లో రహదారులు నిట్టనిలువునా కుంగిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. నగరంలోని ప్రధాన వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఈ హఠాత్ ప్రవాహాల ధాటికి ఆసుపత్రులు, మెట్రో స్టేషన్లు, పాఠశాలల్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. రోడ్లపైకి చేరిన నీటితో నగరంలో ట్రాఫిక్ దాదాపు 90 శాతానికి పైగా స్తంభించిపోయింది.