భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, అగ్రశ్రేణి క్రీడాకారిణి స్మృతి మంధనకు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విశిష్ట గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెఫ్ ఇండియా (UNICEF India) ఆమెను తమ ‘సెలబ్రిటీ అడ్వకేట్’గా నియమించింది. క్రీడా రంగంలో బాలికలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా బాలికల ఆరోగ్యం, శ్రేయస్సు, సాధికారత వంటి కీలక అంశాలపై యునిసెఫ్ చేపట్టే వివిధ కార్యక్రమాలకు మంధాన పూర్తి మద్దతుగా నిలవనున్నారు.