ప్రముఖ నటుడు మరియు సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “దేశంలోని ప్రతి ఇల్లు జంతర్ మంతర్ అవుతుంది” అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎత్తిచూపుతూ ఆయన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ పరిణామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఈ చర్యలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.