పోలవరం జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. కాకవాడలో ‘అడవితల్లి బాట 2.0′ కార్యక్రమాన్ని ప్రారంభించి.. సభలో మాట్లాడారు. తనకు గిరిజన ప్రాంతాలపై మక్కువ ఎక్కువని అన్నారు. ఏడు దశాబ్దాలు అయినా కొన్ని చోట్ల రహదారులు, విద్యుత్ సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు రాకోట గ్రామంలోని గిరిజనులతో డిప్యూటీ సీఎం మాట-మంతి నిర్వహించి ప్రజలు
సమస్యలు అడిగి తెలుసుకున్నారు.