కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విడుదల చేశారు. శనివారం జంతర్ మంతర్‌వద్ద ఆందోళన చేపట్టడానికి ఢిల్లీకి వచ్చిన సీజేపీ నేతలను విమానం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం వారిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. ఆ ముగ్గురిని విడుదల చేయాలని ఆదేశించారు. న్యాయమూర్తి సీజేపీ కీలక నేతలను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారని సీజేపీ నేత రత్నాసింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.