సికింద్రాబాద్‌లోని బొల్లారం కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్ అనే అపార్టుమెంట్‌లో రాత్రి 9 గంటల ప్రాంతంలో బాలిక సెల్లార్‌లో ఆడుకుంటుండగా కిడ్నాప్ అయ్యింది.
సీసీ కెమెరాలో రికార్డైన పుటేజీలో బాలిక వాచ్‌మెన్‌తో పాటు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ముఖ్యమైన ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి పోలీసులు నిందితుడి కోసం జల్లెడ పట్టారు. పోలీసులు చిన్నారి కోసం వెతుకుతుండగా నీళ్లసంపులో మృతదేహం లభ్యమైంది. చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి నీటి సంపులో పడేశాడు. చిన్నారిని వాచ్‌మెన్ చంపి ఉంటాడని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.