ఏపీలో స్థానిక ఎన్నికలకు సర్వం సిద్దమైంది.
ముందుగా మున్సిపల్.. ఆ తరువాత జెడ్పీ పోరు కోసం షెడ్యూల్ విడుదలకు తుది కసరత్తు చేస్తోంది.నెలాఖరు నాటికి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. అలాగే నవంబరు 10 నుంచి 15వ తేదీ మధ్యలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల కానుంది. పంచాయతీలకు మూడు రోజుల వ్యవధిలో మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఎస్ఈసీ నిర్ణయించింది.