ప్రకాశం జిల్లా పాకల బీచ్ లో సముద్రంలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు.మార్కాపురం జిల్లా శ్రీరంగాపురం గ్రామానికి చెందిన 65 మంది పలు వాహనాల్లో సముద్ర తీరానికి వచ్చారు. వారిలో ఏడుగురు సముద్రంలో స్నానం చేస్తుండగా.. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. నారాయణ, విష్ణు అనే యువకులు గల్లంతుకాగా.. మరో ఐదుగురిని స్థానిక మత్స్యకారులు, మెరైన్ పోలీసులు ఒడ్డుకు చేర్చారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో తొలుత సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.