భారత మహిళల క్రికెట్ జట్టు నూతన సారథిగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎంపికైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఉద్దేశించి స్మృతి భావోద్వేగ పోస్ట్ చేసింది. “ఇన్ని సంవత్సరాలు మీతో కలిసి ఆడటం ఒక గొప్ప అనుభూతి. మీ పదేళ్ల కెప్టెన్సీ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. రాబోయే రోజుల్లో మన దేశానికి మరిన్ని విజయాలు, గౌరవాన్ని అందించడానికి కలిసికట్టుగా కృషి చేస్తాం” అని రాసుకొచ్చింది.