ఇవాళ ఉదయం ఇండియా కూటమి పార్టీలతో కలిసి ఈసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్రంగా ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపటి తర్వాత వదిలిపెట్టేశారు. దీంతో వారు తిరిగి ఆకాశవాణి భవన్ లోకి వెళ్లి అక్కడే ధర్నా చేపట్టారు. అప్పటి నుంచీ ఈసీని కలిసేందుకు తమకు అనుమతి ఇచ్చే వరకూ కదిలేది లేదంటూ రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ నేతలు చీకటి పడినా అక్కడే కూర్చొన్నారు. దీంతో ఇవాళ రాత్రికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని పోలీసులు కూడా ఆందోళన చెందుతున్నారు

