ది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలో పనిచేసే శాస్త్రీయ సంస్థ. సీడాక్ 842 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని సీడాక్ సెంటర్లైన ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, పుణె, ముంబై, మొహాలి, కోల్కతా, తిరువనంతపురాల్లో నింపనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 26వ తేదీతో ముగియనుంది.

