గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు పర్యటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్-2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకూ శంకుస్థాపన చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక పీఎంఏవై గ్రామీణ్-2.0 కింద మొత్తం 3 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి.