దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన రీతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అభిజీత్ దీప్కే సంచలన సవాల్ విసిరారు.జులై 20న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించి ఒకసారి పెద్ద తప్పు చేశారు, మళ్లీ అలాంటి తప్పును రిపీట్ చేయవద్దు” అని ఆయన హితవు పలికారు. శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై బలప్రయోగం చేయడం సరికాదని, “ఒకవేళ మళ్లీ లాఠీఛార్జ్ లాంటి చర్యలకు పాల్పడితే, ఈసారి మీరు మీ పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుంది” అంటూ అమిత్ షానుద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.