దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని హైజాక్ చేయడానికి, విమానాన్ని కూల్చివేసేందుకు జరిగిన యత్నం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టి హెచ్చరిక జారీ చేశారు. కాక్‌పిట్‌లోని సహాయ పైలట్ తీవ్రమైన ఇస్లామిక్ తీవ్రవాద భావజాలానికి ప్రభావితమై ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందని ఆయన వెల్లడించారు.

