హైదరాబాద్ గచ్చిబౌలిలో అర్నీషా అనే ఏఐ హబ్ ఆధ్వర్యంలో ఏఐ ఎడ్యుకేషన్ సమ్మిట్ జరిగింది. యూనిట్రీ జీ1 అనే హ్యూమనాయిడ్ రోబో ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఏఐ వినియోగం, వ్యాపార రంగంలో రాణించడంలో ఏఐతో కలిగే ప్రయోజనాలు, అంకుర సంస్థల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. సంస్థ ఫౌండర్ నూతన్, రోబోటిక్స్ నిపుణులు మణితోపాటు సాఫ్ట్ వేర్ నిపుణులు, విద్యార్థులు ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు.