ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ముంబయిలో ఆందోళన చేపట్టింది. శివాజీ పార్క్ వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన్పటికీ.. భారీ సంఖ్యలో యువత హాజరయ్యారు. ‘జ్ఞానేశ్ బ్రో, జస్ట్ రిజైన్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్ఎఫ్ఎస్ఐ, ఏఐఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంఘాల ప్రతినిధులతో పాటు సీనియర్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, గాయకుడు విశాల్ దడ్లానీ, గాంధీ మునిమనువడు, తుషార్ గాంధీ ఈ ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.