బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఖరిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాలేదనే నెపంతో, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభకు రాకుండా జగన్ అలిగి కూర్చున్నారని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని పేర్కొన్నారు.