ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం 11 గంటలకు పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అర్వపల్లి చేరుకుని అక్కడ NTR భరోసా లబ్ధిదారులతో మాట్లాడారు. 12 గంటలకు AELC టౌన్ చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం తిలకించారు. అనంతరం ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. వేదికపైనే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.