గజ్వేల్ గడీ కూల్చినట్లే ఈసారి సిరిసిల్ల గడీని నేలమట్టం చేద్దామని కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ కుటుంబంపై సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గరుడ పక్షి దెబ్బ కాకి పిల్లకు ఏం తెలుసని ఎద్దేవా చేశారు. అమెరికా హోటళ్లలో ప్లేట్లు కడిగిన వ్యక్తికి తన విలువ ఎలా తెలుస్తుందని ఘాటుగా స్పందించారు. ఫామ్‌హౌస్‌లలో నిద్రపోయిన వారికి తన గురించి బాగా తెలుసని వ్యాఖ్యానించారు.

