ఈ ఏడాది వర్షాకాలం అధికారికంగా ముగిసిపోయింది. జూన్ లో మొదలయ్యే రుతుపవనాల సీజన్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. ఇందులో భాగంగా జూన్ తో మొదలయ్యే వర్షాలు సెప్టెంబర్ నాటికి పూర్తి వర్షపాతం అందించడం పరిపాటిగా వస్తోంది. కానీ ఈసారి మాత్రం ఎల్ నినో ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో దేశమంతా వర్షపాత లోటే. తాజాగా కురిసిన వర్షాలతో పరిస్ధితి కాస్త మెరుగుపడినా, అంతిమంగా 13 శాతం వర్షాల లోటుతో ఈసారి సీజన్ ముగిసింది.

