కర్ణాటక, మంగళూరులోని ఒక రిఫైనరీలో పేలుడు ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. మంగళూరులో ఉన్న మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వద్ద బుధవారం ఈ పేలుడు జరిగింది. మొత్తం ఎనిమిది మంది గాయపడగా.. వీరిలో ఒకరికి 35 శాతం కాలిన గాయాలైనట్లు ఎంఆర్‌పీఎల్ సంస్థ వెల్లడించింది. జోకట్టే గ్రామ పరిధిలోని ఎంఆర్‌పీఎల్ కాంప్లెక్స్‌లో జరిగిన పేలుడు ప్రభావంతో రిఫైనరీ చుట్టుపక్కల బిల్డింగులు, నివాసాలు కూడా కంపించాయి,
బాజ్పే పరిధిలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని పలు కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.

