యూపీఐ ఛార్జీలకు నిరసనగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే'(No UPI Day) పాటిస్తామని CTI ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా ఆ రోజు వ్యాపారులు UPI క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులను నల్ల గుడ్డతో కప్పి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఢిల్లీ లజపత్ నగర్ మార్కెట్ నుంచి నో యూపీఐ డే ప్రచారం ప్రారంభమవ్వగా.. దేశవ్యాప్తంగా 2000కుపైగా ప్రాంతాల్లో నిరసనలు కొనసాగనున్నాయి. డిజిటల్ చెల్లింపులపై రుసుంలు విధిస్తే UPI లావాదేవీలు 50 శాతం తగ్గే ప్రమాదముందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.

